గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (10:36 IST)

హిమాలయాలకు తీవ్ర భూకంపం ముప్పు.. షాకవుతున్న శాస్త్రవేత్తలు

హిమాలయాలకు తీవ్ర భూకంపం ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. హిమాలయాలు మన దేశానికి సహజ రక్షణ కవచాలు. ఇప్పుడు ఒక ఆందోళన కలిగించే వార్త తెలుస్తోంది. ఇటీవల ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. హిమాలయాలలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని ఆ అధ్యయనం పేర్కొంది.
 
ఈ అధ్యయనాన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌-కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణులతో కూడిన బృందం జరిపింది.

ఆ బృందం చెబుతున్న దాని ప్రకారం గతంలోనూ హిమాలయాల్లో భారీ భూకంపాలు వచ్చాయి. ఇక రాబోయే వందేళ్ళ లోపే భారీ భూకంపం హిమాలయాల్ని కుదిపేసే అవకాశం ఉందని ఈ పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వేస్కౌస్కీ చెబుతున్నారు.