మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (12:45 IST)

అంతర్‌రాష్ట్ర రాకపోకలు ఓకేగానీ... వారికి మాత్రమే పర్మిషన్

ప్రస్తుతం దేశంలో మూడో దశ లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. అయితే, వివిధ రాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, లాక్‌డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులు, టూరిస్టులు, యాత్రికులు, విద్యార్థులు మాత్రమే ప్రస్తుతానికి ప్రయాణం చేసేందుకు అర్హులని స్పష్టంచేసింది. 
 
సాధారణ ప్రజల ప్రయాణాలకు అనుమతి తేల్చిచెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారాన్ని పంపామని హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. 
 
తమ స్వస్థలాల నుంచి లాక్‌డౌన్‌కు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని, లాక్‌డౌన్‌కు రోజుల ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాహనాలు కూడా స్వస్థలాలకు చేరవచ్చని అజయ్ భల్లా తెలిపారు. 
 
ఉద్యోగార్థం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. సాధారణ కార్యకలాపాలు, వేడుకలు, విందులకు స్వస్థలాలకు వెళ్లేందుకూ అనుమతి లేదని స్పష్టంచేశారు.