సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (09:46 IST)

ఆగ్రాలో దారుణం.. యువతిపై ఐదుగురు సామూహిక అత్యాచారం

gang rape
యూపీ, ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల బాధితురాలి వీడియోను గతంలోనే చిత్రీకరించారు. దానిని చూపించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధిత యువతితో మద్యం తాగించిన నిందితులు ఆ తర్వాత ఆమె తలపై గాజు సీసాను పగలగొట్టారు. 
 
సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియో వైరల్ అయినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం ఆరోపణలతోపాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.