ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (10:29 IST)

డేరా బాబా ఆశ్రమంలో కుప్పలుతెప్పలుగా అస్థిపంజరాలు...

డేరా బాబా ఆశ్రమంలో కుప్పలుతెప్పలుగా అస్థిపంజరాలు...

పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశాల మేరకు డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ ఆశ్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీ మొత్తంలో అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. ఈ ఆశ్రమం సిర్సాలో 700 ఎరకాల విస్తీర్ణంలో విస్తరించివున్నాయి. 
 
డేరా సచ్చా సౌధాలో ముమ్మర తనిఖీలు చేస్తున్న వేళ, పదుల సంఖ్యలో అస్థిపంజరాలు బయటపడినట్టు తెలుస్తోంది. వీటిల్లో కొన్ని పురుష, మరికొన్ని మహిళలు, బాలికల అస్థిపంజరాలు ఉన్నట్టు తెలుస్తోంది. డేరా ప్రధాన కార్యాలయంలోకి బాంబ్ స్క్వాడ్ బృందం తమ శునకాలతో వెళ్లి తనిఖీలు నిర్వహించగా, ఇవి బయటపడ్డాయి. 
 
డేరాలో అస్థిపంజరాలు వెలుగులోకి రావడంపై డేరా అధికార ప్రతినిధి విపాసన స్పందించింది. ఎంతో మంది భక్తులు డేరాకు వచ్చి, తాము మరణించిన తర్వాత ఇక్కడే పూడ్చి పెట్టాలని కోరారని, వారి కోరిక, గుర్మీత్ విధించిన నిబంధనల మేరకే వారిని మరణానంతరం ఇక్కడ పూడ్చి పెట్టామని తెలిపారు.