1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (15:38 IST)

ఒక్క ఏడాదిలో 70లక్షల మందికి బిర్యానీ వడ్డించింది.. ఇంకా?

ప్యారడైజ్ బిర్యానీకి అరుదైన గౌరవం దక్కింది. ఒక్క ఏడాదిలోనే ప్యారడైజ్ హోటల్ దాదాపు 70లక్షల మంది వినియోగదారులకు బిర్యానీ వడ్డించింది. ఇంత భారీ స్థాయిలో బిర్యానీ విక్రయించినందుకు గాను ప్యారడైజ్‌‌ ఛైర్మన్‌ అలీ హేమతికి ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ సంస్థ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా ప్రకటించింది. 
 
దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ప్యారడైజ్ బిర్యానీ ప్రస్తుతం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం ద్వారా ఆ సంస్థ అధికారులు పండగ చేసుకున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌‌ హోటల్లో గురువారం కేక్‌ కట్‌ చేసి సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. 
 
2017 జనవరి 1 నుంచి అదే ఏడాది డిసెంబర్ 31 వరకు 70,44,289 బిర్యానీలను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. బెస్ట్ బిర్యానీ అవార్డును సైతం ప్యారడైజ్ బిర్యానీ కైవసం చేసుకుంది. ప్యారడైజ్ బిర్యానీ సంస్థల చైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించి గౌరవించింది
 
ఈ సందర్భంగా ఛైర్మన్ అలీ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ అవార్డుతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 ప్యారడైజ్‌ బ్రాంచ్‌లు ఉన్నాయని, త్వరలోనే విదేశాల్లోనూ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.