శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (17:35 IST)

మార్చి 3న ఉరితీస్తారని భావిస్తున్నా : నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు చాలా అవకాశాలిచ్చారని, ఈసారి శిక్ష అమలు చేయడం వాయిదా పడదని అనుకుంటున్నానని అన్నారు. ఖరారు చేసిన తేదీ నాడే ఆ నలుగురిని తప్పకుండా ఉరి తీస్తారని భావిస్తున్నానని, దోషులకు శిక్ష పడిన తర్వాతే దేశానికి తన సందేశం వినిపిస్తానని చెప్పారు.
 
మరోవైపు, నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్‌ను పటియాలా హౌస్ కోర్టు జారీచేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీచేశారు. 
 
దీంతో మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష అమలు కాలేదు.