సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:01 IST)

భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య కీలక ఒప్పందం.. కాల్పులు ఆగుతాయా?

భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడకూడదని భారత్, పాకిస్థాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో క్రాస్ బోర్డర్ ఫైరింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ముగింపు పలకాలనే యోచనలో ఇరు దేశాల అత్యున్నత మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలల్లో ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.
 
చర్చల అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వాస్తవానికి ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2003లోనే కుదిరింది. అయినప్పటికీ, పాక్ ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, పాక్ నిరంతరం కాల్పులకు తెగబడుతోంది. 
 
పాక్ కాల్పుల వల్ల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాక్ లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్‌లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.