చెల్లీ.. నీ భర్తను చంపేస్తున్నాం .. బావమరదుల దారుణం
తాము ఎంతగానో ఇష్టపడిన చెల్లి కులాంతర వివాహం చేసుకోవడం అన్నదమ్ములు జీర్ణించుకోలేక పోయారు. పైగా, చెల్లి భర్తను తమ ఇంటి అల్లుడుగా స్వీకరించేందుకు వారి మనస్సు అంగీకరించలేదు. అందుకే.. బావమరదులు కలిసి చెల్లి భర్తను అత్యంత కిరాతకంగా చంపేశారు. అతన్ని చంపే ముందు.. చెల్లికి ఫోన్ చేసి.. నీ భర్తను చంపేస్తున్నాం.. క్షమించమన్నా అని ప్రాధేయపడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
చెల్లెలు కులాంతర వివాహం చేసుకుంది. ఆ వివాహం ఆమె అన్నలకు నచ్చలేదు. దీంతో ఎలాగైనా బామ్మర్దిని హత మార్చాలని కుట్ర చేశారు. పెళ్లి చేసుకుంటే చేసుకున్నారలే సంతోషంగా ఉండండి అంటూ అత్తమామలు దీవించారు. కానీ బావలు మాత్రం కోపంతో లోలోపల రగిలిపోయారు. బామ్మర్ధిని హత్య చేయాలని ప్లాన్‌వేశారు. ప్లాన్ ప్రకారం పట్టపగలే అందరూ చూస్తుండగానే బాధితుణ్ని హతమార్చారు. అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాకు చెందిన నీరజ్ (23) అనే యువకుడు అదే ప్రాంతంలో ఉండే వేరే కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు.
దీంతో ఊరిపెద్దలు రాజీ కుదిర్చారు. అమ్మాయి తల్లిదంద్రులు ప్రేమ వివాహానికి మద్దతిచ్చారు. ఆమె అన్నలు మాత్రం అందుకు అంగీకరించలేదు. రోజులు గడుస్తున్నా నిందితుల నుంచి బాధితుడికి వేధింపులు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన నీరజ్‌ను అందరూ చూస్తుండగానే పానిపట్ కూరగాయల మార్కెట్‌లో డజను సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరరాయ్యారు. ఈ దారుణానికి ముందే కొన్ని నిమిషాలు ముందు నీరజ్ భార్యకు ఫోన్ చేసి మరీ త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ నీరజ్ సోదరుడు జగదీష్ వాపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.