బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (07:47 IST)

తపాలాశాఖలో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌

బ్యాంకింగ్ రంగానికి ధీటుగా సేవలందించేందుకు తపాలా శాఖ సిద్ధమవుతోంది. తపాలాశాఖలో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ (సీపీఎంజీ) ఎస్‌.రాజేంద్రకుమార్‌ తెలిపారు.

జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ మదీనాలోని జూబ్లీ హెడ్‌పోస్టాఫీస్‌లో ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల పోస్టరును ఆయన విడుదల చేశారు. కరోనాతో మరణించిన నలుగురు తపాలా ఉద్యోగులకు నివాళి అర్పించారు.