బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జనవరి 2023 (18:39 IST)

మదురై జల్లి కట్టు పోటీల్లో 60 మందికి గాయాలు..

Jallikattu
తమిళనాడు రాష్ట్రంలోని మదురై సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంప్రదాయ క్రీడా పోటీలైన జల్లికట్టు పోటీల్లో 60 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మదురైలోని అవనీయాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ జల్లికట్టు పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు. ఈ పోటీల్ ప్రారంభంలోనే వందలాది ఎద్దులు దూసుకుని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
వాస్తవానికి ఈ పోటీల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. 40 వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ పోటీలకు తరలివచ్చిన వారిని చూసిన అంబోతులు బెదిరిపోతూ పరుగులు తీశాయి. వాటిని పట్టుకునేందుకు యువకులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వారిలో అనేక మంది గాయపడ్డారు.