బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (14:26 IST)

కేరళలో దారుణం.. 26మంది విద్యార్థులపై టీచర్ లైంగిక దాడి..

కేరళలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ స్టూడెంట్స్‌పై ఓ సీనియర్ టీచర్.. కొన్నేళ్లపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. తాజాగా టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి కేరళ కన్నూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
కోవిడ్ సంక్షోభం అనంతరం 2021 నవంబరులో ఆ స్కూల్ రీ ఓపెన్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ విద్యార్థులపై 52 ఏళ్ల టీచర్ కన్నేశాడు. అప్పటి నుంచి దాదాపు 26మందిని అతను లైంగికంగా వేధించాడు. విద్యార్థులు ధైర్యం చేసుకుని ఈ వేధింపుల వ్యవహారానికి బయటికి చెప్పలేకపోయారు. 
 
కానీ ఓ విద్యార్థిని ధైర్యం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీచర్ సాయంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. 12న సీనియర్​ టీచర్​ను అరెస్ట్​ చేశారు.