శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:21 IST)

తప్పిపోయిన ప్రేయసి కోసం.. 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

ప్రేమించిన భార్య కోసం 42 ఏళ్ల జార్ఖండ్ వ్యక్తి మనోహర్ నాయక్ సైకిల్ యాత్ర చేశాడు. తప్పిపోయిన జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ 600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. అంతకుముందు నాయక్ భార్య అనిత మకర సంక్

ప్రేమించిన భార్య కోసం 42 ఏళ్ల జార్ఖండ్ వ్యక్తి మనోహర్ నాయక్ సైకిల్ యాత్ర చేశాడు. తప్పిపోయిన జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ 600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. అంతకుముందు నాయక్ భార్య అనిత మకర సంక్రాంతి జరుపుకునేందుకు పశ్చిమ బెంగాల్‌లోని స్వగ్రామం కుమ్రాసోల్‌కు జనవరిలో వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి రాలేదు. 
 
ఆమెకు మానసిక లోపం. మాట్లాడలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వున్న ఆమె కనిపించకపోవడంతో నాయక్‌లో ఆందోళన మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. సైకిల్ సిద్ధం చేసుకుని 24 రోజుల పాటు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 
 
రోజూ 25 కిలోమీటర్ల లెక్కన భార్య స్వస్థలానికి చేరుకున్నాడు. అక్కడ భార్య కనిపించకపోవడంతో.. పోలీసుల సాయంతో ఖరగ్ పూర్‌లో కనుగొన్నాడు. తనతో జార్ఖండ్‌కు వెంటబెట్టుకుని వెళ్ళాడు.