కర్ణాటక బ్యాంకు ఉద్యోగులకు షాక్.. ఏమైంది?
కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులకు షాక్ తప్పలేదు. ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి వుంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయవచ్చని కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి సంతోశ్ హంగల్ తెలిపారు.
ఇతర భాషల్లో బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు.. కర్ణాటక వాసులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కర్ణాటక వాసులు బ్యాంకు ఉద్యోగులు కన్నడ భాషలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.