బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (21:47 IST)

కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి: కొత్తగా 9,735 కేసులు

కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 9,735 మంది కరోనా బారినపడ్డారు. కరోనా మరణాలు వందకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 151 మంది కరోనాతో మరణించారు. కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,677కు చేరింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1,24, 441 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ సంఖ్య కన్నా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరిగింది. కొత్తగా 13,878 మంది కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షలు మొత్తం 93,202 మందికి నిర్వహించారు.