సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (17:26 IST)

కేరళలో ఖాతా తెరవని కాషాయం పార్టీ : మెట్రోమ్యాన్‌కు తప్పని ఓటమి!

కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర ఓటర్లు దిమ్మ‌దిరిగే షాకిచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు కేర‌ళ‌లో 35 స్థానాలు గెలుస్తామ‌ని ప్ర‌గ‌ల్భా ప‌లికిన ఆ పార్టీ క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. 
 
ఇంత‌కుముందు ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ త‌న సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె.సురేంద్ర‌న్ స‌హా న‌టుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్ కూడా ఓట‌మి పాల‌య్యారు.
 
నెమోమ్ స్థానంలో మొద‌ట బీజేపీ అభ్య‌ర్థి రాజ‌శేఖ‌ర‌న్ ఆధిక్యంలో నిలిచినా.. త‌ర్వాత మూడోస్థానానికి ప‌రిమితమ‌య్యారు. ఈ స్థానం నుంచి ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి శివ‌న్‌కుట్టీ 2025 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. అటు మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్‌ను పాల‌క్క‌డ్ స్థానంలో ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి ష‌ఫీ పారంబిల్ 2657 ఓట్ల తేడాతో ఓడించారు. 
 
అటు త్రిస్సూర్‌లో మొద‌ట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివ‌రికి మూడోస్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఈ మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంద‌ని భావించినా చివ‌రి రౌండ్ల‌లో ఆ పార్టీ అభ్య‌ర్థులు దారుణంగా ఓడిపోయారు.