హమ్మ... ఖుష్బూ వారిని ఎంత మాట అనేసింది?

khushboo
ఎం| Last Updated: బుధవారం, 10 జూన్ 2020 (21:47 IST)
చాలా కాలం తర్వాత సీనియర్ నటి ఖుష్బూ మరో వివాదంలో చిక్కుకున్నారు. జ‌ర్న‌లిస్టుల గురించి ఆమె మాట్లాడిన ఆడియో టేప్ స‌ర్వ‌త్రా చర్చనీయాంశమైంది.

‘ప్ర‌స్తుతం మీడియా వారికి క‌రోనా గురించి త‌ప్ప రాయ‌డానికి ఏమీ లేదు. షూటింగ్స్ ప్రారంభం కాగానే వాళ్లు మ‌న‌పై దృష్టి పెడ‌తారు. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లో ఫొటోలు, వీడియోల‌కు అనుమ‌తులు ఇవ్వొద్దు’ అంటూ ఖుష్బూ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది.

దీనిపై ఖుష్బూ క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ‘‘నేను మాట్లాడిన ఆడియో నిర్మాత‌ల గ్రూప్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌న మ‌ధ్య ఇలాంటి వ్య‌క్తులున్నార‌ని చెప్ప‌డానికి చింతిస్తున్నాను. మ‌న ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడ‌తామో ప్రెస్ గురించి అలాగే మాట్లాడాను.

నా 34 ఏళ్ల కెరీర్‌లో పాత్రికేయుల గురించి ఎక్క‌డా, ఎప్పుడూ అమ‌ర్యాద‌గా మాట్లాడ‌లేదు. నా మాట‌ల వ‌ల్ల ఎవ‌రైనా ఇబ్బందిప‌డుంటే క్ష‌మించండి. నా ఆడియో టేప్‌ను ఏ నిర్మాత లీక్ చేశాడో నాకు తెలుసు. కానీ నేను ఆయ‌న పేరు చెప్ప‌ను. నా నిశ్శ‌బ్దం, క్ష‌మాగుణ‌మే వారికి అతి పెద్ద శిక్ష’’ అని తెలిపారు ఖుష్బూ.
దీనిపై మరింత చదవండి :