శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (08:34 IST)

నిద్రపోతే లక్ష జీతం

పని చేస్తే జీతమిస్తారు ఎక్కడైనా. కానీ నిద్రపోతే చాలు జౌతమిస్తామంటోంది బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ సంస్థ. ‘రోజూ రాత్రి 9 గంటలు శుభ్రంగా పడుకోండి.. రూ. లక్ష జీతం ఇస్తాం’ అటోంది.

ఈ కంపెనీ స్లీప్‌ ఇంటర్న్‌షి్‌పతో ముందుకు వచ్చింది. ఈ ఇంటర్న్‌షి్‌పలో పాల్గొనే వారు బాగా నిద్రపోయేలా స్లీప్‌ ఎక్స్‌పర్ట్స్‌, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియర్‌ డిజైనర్లు, ఫిట్‌నెస్‌ నిపుణులు పలు సూచనలు చేస్తారు.

అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి వారందరూ గాఢంగా, ఎక్కువ సేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు.

ఇందులో పాల్గొనేవారికి ఏదైనా డిగ్రీ ఉండాలి. బెడ్‌పైకి వెళ్లగానే 10-20 నిమిషాల్లో నిద్రలోకి జారుకునే లక్షణం ఉండాలి. ట్రై చెయ్యండి బాస్.. ఇందులో పోయేదేం లేదు.. మహా అయితే నిద్ర తప్ప.