గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:18 IST)

లవ్ ఎఫైర్, యువతి తల నరికిన వరుడి మాజీ ప్రియురాలి బంధువులు

ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలను బలగొంది. ప్రియుడు మరో యువతిని పెళ్లాడుతున్నాడన్న కసితో ఆమె తరపు బంధువులు అత్యంత దారుణ హత్యకు పాల్పడ్డారు.
 
వివరాలను చూస్తే... బీహారు రాష్ట్రంలోని నలంద జిల్లా బిగహా గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతితో నీర్‌పూర్ గ్రామానికి చెందిన కుమార్‌తో వివాహం నిశ్చయించారు పెద్దలు. నిశ్చితార్థం సమయంలో వరుడుకి రూ. 4 లక్షల విలువైన లాంఛనాలను కూడా సమర్పించుకున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది.
 
ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వధువు కాళ్లు, చేతులు కట్టేసి ఆమె తలను నరికి అత్యంత కిరాతంగా హతమార్చి అక్కడే పడేసి పరారయ్యారు. ఉదయాన్నే తల లేని యువతి శవాన్ని చూసిన స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 
ఐతే ఈ దారుణ హత్యకు కారణం వరుడి ప్రేమ వ్యవహారమే అని వధువు తరపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో వరుడు మరో యువతితో ప్రేమాయణం సాగించాడనీ, ఆమెను వదిలేసి మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధం కావడంతో వారే ఈ దారుణానికి పాల్పడినట్లు చెపుతున్నారు.