బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (11:57 IST)

మేకలను మేపుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఐసీయూలో..?

rape
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని తన గ్రామ శివారులో మేకలను మేపుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులు మంగళవారం తెలిపారు. బాధితురాలు మంగళవారం తెల్లవారుజామున నాగ్రా గ్రామంలోని వ్యవసాయ పంటపొలాల్లో అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తన గ్రామ శివారులో ప్రతిరోజూ సాయంత్రం తన కుటుంబానికి చెందిన మేకలను మేపుతుండగా, సోమవారం ఒంటరిగా ఉన్న ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను మొరెనాలోని జిల్లా ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

28 ఏళ్ల వ్యక్తి అయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.