ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (15:52 IST)

లంచం డబ్బుతో అడ్డంగా దొరికిన ఉద్యోగి.. నమిలి మింగేశాడు...

gajendra singh
ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం డబ్బుతో అడ్డంగా చిక్కాడు. దీంతో ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక వాటిని నమిలి మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గజేంద్ర సింగ్ అనే ఉద్యోగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో రెవెన్యూ విభాగంలో పని చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం ఆయన వద్దకు వచ్చిన వ్యక్తి నుంచి రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేటపుడు రెడ్ హ్యాండెడ్‌గైగా పట్టుకున్నారు. ఈ ఊహించని పరిణామాంతో రెవెన్యూ అధికారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 
 
లంచంగా తీసుకున్న డబ్బులు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యాడు. డబ్బుతో సహా దొరికిపోరాదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన ప్రాణానికి వచ్చిన ముప్పేమి లేదని చెప్పారు. అయినప్పటికీ గజేంద్ర సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.