గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (15:07 IST)

దేశంలో రూ.500 నోట్ల ఉపసంహరణ? ఆర్బీఐ గవర్నర్ బదులేంటి?

currency notes
దేశంలో పెద్ద నోట్ల చెలామణిని కేంద్ర క్రమంగా నిషేధిస్తూ వస్తుంది. ఇప్పటికే వెయ్యి రూపాయల నోటు కేంద్రం నిషేధించి, ఆ తర్వాత రూ.2 వేల నోటును తీసుకొచ్చింది. దీన్ని కూడా సెప్టెంబరు నెలాఖరుతో నిలిపివేయనుంది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోటును వెనక్కి తీసుకునే ప్రక్రియను భారత రిజర్వు బ్యాంకు చేపట్టింది. ఆ తర్వాత రూ.500 నోటును కూడా వెనక్కి తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. 
 
ఈ ప్రచారంపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం లేదా రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటువంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని పౌరులకు సూచించింది. ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 50శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. 
 
వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నోట్లన్నీ దాదాపు 85శాతం డిపాజిట్ల రూపంలోనే బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉందని.. అయినప్పటికీ చివరి నిమిషం వరకూ వేచి ఉండవద్దని పౌరులకు సూచించారు. మార్పిడి చేసుకునేందుకుగాను ఆర్బీఐ దగ్గర ఇతర ఇతర కరెన్సీ ఉందని పేర్కొన్నారు.