మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు.. 382 పక్షులు మృతి

poultry birds
సెల్వి|
poultry birds
మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు విజృంభిస్తున్నాయి. తొమ్మిది జిల్లాల్లో గురువారం 382 పక్షులు చనిపోయాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన పక్షుల సంఖ్య 3,378కి చేరింది. రాష్ట్రంలోని లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

జనవరి 14న మొత్తం 382 పక్షులు చనిపోయాయి. ఈ నమూనాలను పుణె, భోపాల్‌లలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపారు. జనవరి 8 నుంచి 14 వరకు వివిధ రకాలకు చెందిన 3,378 పక్షుల మరణాలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలు పక్షుల ఫ్లూ బారిన పడ్డాయి’ అని రాష్ట్ర శాఖ తెలిపింది. ముంబై, ఘోడ్ బందర్, దాపోలి ప్రాంతాల్లో కాకులు, కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. పర్బనీ, లాతూర్, బీడ్, నాందేడ్ జిల్లాలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకింది.దీనిపై మరింత చదవండి :