ఒకరితో నిశ్చితార్థం ... మరొకరితో ప్రేమ - ఇద్దరికీ పిల్లలు పుట్టాక పెళ్లి.. ఎక్కడ?
ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించి గర్భవతిని చేశాడు. వీరిద్దరూ ఆడబిడ్డలనే ప్రసవించారు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలిసి పంచాయితీ పెట్టి, ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా కేశ్‌కాల్‌కు సమీపంలోని ఉమ్లా గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్ సింగ్ సలామ్‌కు ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్ అనే యువతితో ముందుగా నిశ్చితార్థం అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె కొద్ది నెలల తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి గోటా అనే యువతిని రంజన్ ప్రేమించాడు. ఈ క్రమంలోనే సన్నో గర్భం దాల్చింది. ఆమె సైతం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రంజన్ సింగ్ కుటుంబంతో మాట్లాడారు.
గ్రామంలో పంచాయితీ సైతం నిర్వహించారు. ఇద్దరు యువతులు రంజన్ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. అందుకు పెద్దలు సైతం ఒప్పుకోవడంతో ఒకే వేదికపై ఈ నెల 8న రంజన్ సింగ్ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.