ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (22:24 IST)

ప్రముఖ మోడల్ జెస్సికా లాల్‌ను హత్య చేసిన మనుశర్మ జైలు నుంచి విడుదల

సంచలనం సృష్టించిన ప్రముఖ మోడల్‌ జెస్సికా లాల్ హత్య కేసులో నిందితుడైన మనుశర్మ జైలు నుంచి విడుదలయ్యాడు. గత 23 ఏళ్లుగా జైలులో వున్న మనుశర్మను విడుదల చేయాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆదేశాలు జారీచేశారు. 1999లో జెస్సికాలాల్ హత్య సంచలనం సృష్టించింది.
 
ఈ హత్య కేసులో మరణశిక్ష విధించబడ్డ జీవిత ఖైది మనుశర్మ చెరసాల నుండి విడుదలయ్యాడు. జెస్సికా లాల్ ఓ అందాల రాశి. 1999 ఏప్రిల్ నెల 30వ తేదీన ఢిల్లీలో ఓ హోటల్లో అర్థరాత్రి వేళ మాజీ కేంద్రమంత్రి వినోద్ శర్మ కుమారుడు మనుశర్మ తనకు మద్యపానము అందించాలని ఆమెను కోరాడు. దానికి జెస్సికా లాల్ వ్యతిరేకించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మనుశర్మ తన దగ్గరనున్న తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు.
 
ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. దీనితో అతడు గత 2006 నుంచి తీహారు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో మనుశర్మ గత 23 ఏళ్లుగా జైలులో వున్నాడనీ, విడుదల చేయాలని అతడి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. ఈ నేపధ్యంలో మనుశర్మను విడుదల చేయాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆదేశాలు జారీచేశారు.