ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:35 IST)

ముంచుకొస్తున్న నాలుగో ముప్పు.. మాస్క్ లేకుంటే ఫైన్

face mask
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో కరోనా అల ముంచుకొస్తుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ మస్ట్‌గా ధరించాలంటూ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించకుంటే అపరాధం విధిస్తామని హెచ్చరింది.
 
కరోనా తొలి దశ, మూడో దశల్లో ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన విషయం తెల్సిందే. ఇపుడు ఫోర్త్ వేవ్‌ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. మాస్క్ ధరించని వారిపై రూ.500 అపరాధం వసూలు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
రెండు మూడు రోజులుగా ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా తదితర ప్రాంతాలతో పాటు ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. ఢీడీఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్‌లు ధరించని వారిపై రూ.500 అపరాధం విధించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, పాఠశాలలు, కళాశాలలను కొనసాగించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది.