శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (10:55 IST)

కుప్పకూలిన మిగ్ 21, పైలెట్ దుర్మరణం

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF)కి చెందిన మిగ్-21 విమానం శుక్రవారం సాయంత్రం శిక్షణా సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో వున్న పైలట్‌ మృత్యువాత పడ్డాడు.

 
 
ఈ విమాన దుర్ఘటనపై జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.... భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం డెసర్ట్ నేషనల్ పార్క్ (డిఎన్‌పి) పరిధిలోని సామ్‌లో కూలిపోయిందని మాకు సమాచారం అందింది. జైసల్మేర్ ఎయిర్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయింది” అని తెలిపారు.

 
తను సంఘటనా స్థలానికి చేరుకున్నానని, వైమానిక దళానికి సమాచారం అందించామని సింగ్ తెలిపారు.