సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (16:13 IST)

కోతి చేష్టలంటే ఇదే కాబోలు.. నాలుగు లక్షల్ని ఎత్తుకెళ్లి..?

కోతి చేతికి పూలదండ చిక్కితే ఏమౌతుందో అందరికీ తెలిసిందే. కోతి చేష్టలు మామూలుగా వుండవు. తాజాగా ఓ కోతి చేతిలో నాలుగు లక్షల రూపాయల బ్యాగు చిక్కింది. అంతే అందులో వున్న డబ్బునంతా వెదజల్లింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోతి పిచ్చి చేష్టలు అందరినీ టెన్షన్ పుట్టించాయి. ఈ ఘటన సీతాపూర్‌లోని రిజిస్ట్రీ ఆఫీసు వద్ద జరిగింది. వికాశ్ భవన్ రిజిస్ట్రీ ఆఫీసు వద్ద ఓ సీనియర్ సిటిజన్ చేతిలో ఉన్న నగదు బ్యాగును కోతి లాక్కుని పారిపోయింది. 
 
బ్యాగుతో పరారైన ఆ కోతి.. సమీపంలో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి.. బ్యాగులో ఉన్న సుమారు 12 వేల కరెన్సీ నోట్లను కిందకు పడేసింది. దీంతో అక్కడ ఉన్న జనం ఆ డబ్బును ఏరుకునే పనిలో పడిపోయారు. అయితే అనేక ప్రయత్నాల తర్వాత కోతి నుంచి కరెన్సీ బ్యాగును చేజిక్కించుకున్నారు. నగరంలోని కోత్వాల్ ఏరియాలో ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.