1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (15:50 IST)

కేరళను తాకిన రుతుపవనాలు

Rains
నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే ఆ రాష్ట్రాన్ని పలకరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
 
ఇటీవల అసని తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదిలాయి. 
 
మరోవైపు ఈ రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది.