ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (11:18 IST)

గడ్డివాము చాటును మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు లాక్కెక్కి సామూహిక అత్యాచారం చేశారు. ముంబైకు సమీపంలోని గోవండి ప్రాంతం, శివాజీ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ కొందరు సహచర క్యాటరర్‌లలో కలిసి పని చేసి, వారితో కలిసి ఇంటికి బయలుదేరింది. అపుడు ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపి ఆమెను మురికివాడలోని ఓ గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కొంతమంది యువకులు వేచి చూస్తున్నారు. ఈ మహిళ అక్కడకు చేరుకోగానే వారంతా కలిసి ఆ మహిళను బలవంతంగా గడ్డివాము చాటుకు బలవంతంగా లాక్కెళ్లారు. 
 
సామూహిక అత్యాచారం తర్వాత కామాంధులు పారిపోయారు. తనకు జరిగిన ఘటనపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగానే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మైనర్లే. పరారీలో ఉన్న మరో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.