శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 మే 2020 (16:12 IST)

ఆరోగ్యంగానే నసీరుద్దీన్‌ షా

బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుమారుడు వివాన్‌ షా తెలియజేశారు. అనారోగ్యం వల్ల బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చాయి.

దీంతో చాలామంది నెటిజన్లు.. నసీరుద్దీన్‌ షాను ఉద్దేశిస్తూ సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు పెట్టారు. ఆయన వెంటనే కోలుకోవాలని తెలియజేస్తూ ట్వీట్లు చేశారు.

దీంతో ఆయన కుమారుడు వివాన్‌ షా తన ట్విటర్‌ ఖాతా వేదికగా స్పందించారు. తన తండ్రి అనారోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలిపారు.

అనారోగ్య పరిస్థితుల కారణంగా బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ బుధవారం మృతి చెందగా, రిషి కపూర్‌ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.