శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (10:28 IST)

విమానాల ల్యాండింగ్ కోసం సిద్ధమవుతున్న జాతీయ రహదారులు

విమానాల ల్యాండింగ్ కోసం జాతీయ రహదారులు సిద్ధమవుతున్నాయి. ఇదేంటి? జాతీయ రహదారులపై సాధారణ వాహనాలు కదా తిరుగుతాయి.. విమానాల కోసమేంటి అంటారా?... అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే! 
 
భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు త్వరితగతిన సాయమందించేందుకు విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో విమానాశ్రయాలపైనే ఆధారపడాల్సిన పని లేకుండా ఈ స్ట్రిప్ లను వినియోగిస్తారు. ఎయిర్ ఫోర్స్ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మొత్తం 13 నిర్మిస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో నెల్లూరు-చిలకలూరిపేట మధ్య చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ, మేదరమెట్ల దగ్గర 2 స్ట్రిప్ లను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వల్ల 3 నెలలుగా స్తబ్దత నెలకొనగా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో అధికారులు మళ్లీ దృష్టి పెట్టారు. 
 
డివైడర్ల ఏర్పాటుతో పాటు రోడ్డు మార్జిన్లు, చెట్ల తొలగింపు పూర్తైంది. మట్టి చదునుచేసి కాంక్రీటు రహదారి నిర్మిస్తున్నారు.
 
సింగరాయకొండ దగ్గర రూ.52.87 కోట్ల అంచనాతో ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించగా 20 శాతం అయ్యాయి. మేదరమెట్ల దగ్గర రూ.66.87 కోట్లతో నిర్మిస్తున్న ఎయిర్ స్ట్రిప్ ఇప్పటికే 25 శాతం పూర్తైంది.

5 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరికి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ సంజయ్ తేలిపారు.