శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 17 జులై 2017 (21:22 IST)

వెంకయ్య గెలుపు బాధ్యత మీదే... బాబుతో ప్రధాని, కన్వీనర్ బాధ్యత మీకే(వీడియో)

ఒకవైపు ఆనందం... ఇంకోవైపు ఆందోళన... ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెన్నుదన్నుతో ఏపీకి నిధులను రాబట్టుకుంటున్న చంద్రబాబు నాయుడికి వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించడం ఒకవిధంగ

ఒకవైపు ఆనందం... ఇంకోవైపు ఆందోళన... ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెన్నుదన్నుతో ఏపీకి నిధులను రాబట్టుకుంటున్న చంద్రబాబు నాయుడికి వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించడం ఒకవిధంగా ఇబ్బందికర పరిస్థితే. ఏదేమైనప్పటికీ తెలుగుబిడ్డ అత్యున్నత పదవిని అలంకరించబోతున్నారన్న సంతోషం వుండనే వుంటుంది. 
 
ఇకపోతే ఎన్డీయే ఉప‌రాష్ట్రపతి అభ్య‌ర్థిగా వెంక‌య్య నాయుడిని ఎంపిక చేసిన నేపధ్యంలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు. వెంక‌య్య విజ‌యానికి ఎన్డీఏ క‌న్వీన‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని ఆయన కోరారు. కాగా దీనిపై చంద్రబాబు నాయుడు స్పందన ఇంకా తెలియరాలేదు. వెంకయ్య ఎంపికపై వీడియో...