బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:05 IST)

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాలు.. సుప్రీం కోర్టు సీరియస్

సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారాన్ని ఏడాది లోపు తేల్చాలని పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు.. ఇందులో తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
వీటిలో హైకోర్టులతో పాటు దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీకి కూడా పలు ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రభావం ఏపీలో సీఎం వైఎస్ జగన్‌పై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న సీబీఐ, ఈడీ కేసులపై కచ్చితంగా పడబోతోంది. 
 
సుప్రీం ఆదేశాల ప్రకారం ఆయా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జిషీట్లు వేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతుండగా.. విచారణలు వేగవంతం చేయాలని సీబీఐ కోర్టుపైనా ఒత్తిడి పెరుగుతోంది. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే నేరచరిత్ర కల నేతలను దూరంగా ఉంచాలని భావిస్తున్న సుప్రీంకోర్టు.. వీరికి వ్యతిరేకంగా దాఖలైన కేసుల్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.