బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (07:00 IST)

అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు: కేంద్రం

కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సిన్‌ అవసరం లేదని, అవసరమైనంత మందికి ఇస్తే సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ ప్రధాన లక్ష్యం వైరస్‌ చైన్‌ను తెగ్గొట్టడమేనని, దాన్ని సాధించేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

ప్రతీఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ చేసేందుకు దేశంలో కొందరిని జాబితా నుంచి తొలగించారని వదంతులలపై వివరణ ఇచ్చింది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాక.. ఇక అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు.

ఇలాంటి సాంకేతికపరమైన అంశాల్లో వాస్తవాలను ఆధారంగా చేసుకొని చర్చలు జరగాల్సి ఉంటుందన్నారు. జనాభాలో కొద్ది మందికే టీకా ప్రారంభిస్తామని, అందుకే కరోనా నుంచి రక్షించుకోవడానికి మాస్‌్కలను కవచంగా వాడాలని బలరాం భార్గవ అన్నారు. 

వ్యాక్సిన్‌లపై వచ్చే అసత్య వార్తలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మీడియా, వ్యాక్సిన్‌ తయారీదారుపై కూడా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ భద్రతపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడిస్తుందని చెప్పారు.