గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:46 IST)

ఒడిశాలో విజృంభిస్తోన్న 'స్క్రబ్ టైఫస్'- ఐదు కేసులు నమోదు

scrub typhus
scrub typhus
కొత్త జ్వరం ఒడిశాలో విజృంభిస్తోంది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇవి సరిపోవు అన్నట్లు స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం వచ్చింది. స్క్రబ్ టైఫన్​ అనే జ్వరం టిక్ అనే క్రిమి కాటు వల్ల ఏర్పడుతుంది. క్రిమి కాటు నుంచి కనిపించే గుర్తు లేదా మచ్చ ఇందుకు హెచ్చరిక సంకేతం అంటున్నారు.
 
తాజాగా ఒడిశాలో 'స్క్రబ్ టైఫస్' విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం మరో పది కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి నమోదైన మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 832కి పెరిగింది. ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. 
 
దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది. పైగా దీనికి వ్యాక్సిన్ లేకపోవడం కలవరానికి గురి చేస్తోంది.