శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (15:39 IST)

పాముతో శునకం ఢీ.. పప్పీలను కాటేసిన నాగుపాము

కుక్క, పాము జగడానికి దిగాయి. శునకం బిడ్డలను పాము కాటేస్తుంటే తమాషా చూసినట్లు చూశారు. ఆ దృశ్యాలను సెల్ ఫోనులో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెర్రి ఆనందం పొందారు. ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చే

కుక్క, పాము జగడానికి దిగాయి. శునకం బిడ్డలను పాము కాటేస్తుంటే తమాషా చూసినట్లు చూశారు. ఆ దృశ్యాలను సెల్ ఫోనులో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెర్రి ఆనందం పొందారు. ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చేసుకుంది. కుక్క పిల్లలను భారీ నాగుపాము కాటేసింది. పాముకాటుకు కుక్క పిల్లలు మృతి చెందాయి. 
 
భద్రక్‌లో కొద్ది రోజుల క్రితం ఓ శునకం పిల్లలను కనింది. రాత్రి వేళ కుక్క పిల్లల వద్దకు భారీ నాగు పాము వచ్చింది. పాము దాడి నుంచి పిల్లలను తల్లి శునకం అడ్డుకుంది. కాసేపటికి పాము మళ్లీ బుసలు కొట్టింది. కుక్క ఎదురుతిరగడంతో పాము వెనుదిరిగే ప్రయత్నం చేసింది. 
 
అయితే, ఈ దృశ్యాలను సెల్ ఫోన్‌లో బంధిస్తున్న స్థానికులు పామును మళ్లీ శునకంపైకి ఊసిగొల్పారు. మళ్లీ కుక్క పిల్లల వద్దకు చేరుకున్న పాము శునకం పిల్లలను కాటేసింది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి.  
 
తర్వాత తల్లి శునకంపైకి దాడికి యత్నించింది. శునకం గట్టి అరుపులతో పామును నిలువరించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పామును స్నేక్ క్యాచర్ పట్టుకెళ్లి అడవుల్లో విడిచిపెట్టాడు.