సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (11:13 IST)

ట్రక్ డ్రైవర్‌కు వింత అనుభవం.. హెల్మెట్ ధరించలేదని.. రూ.వెయ్యి ఫైన్

దేశంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్లతో ప్రయాణికులు జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ చలాన్లు కట్టలేమంటూ వాపోతున్నారు. అడ్డగోలు నిబంధనలతో జనాలను దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. ఐతే తాజాగా ఓ ట్రక్ డ్రైవర్‌కు కూడా వింత అనుభవం ఎదురయింది. హెల్మెట్ ధరించలేదని లారీ డ్రైవర్‌కు ఫైన్ వేశారు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ప్రమోద్ కుమార్ శ్వైన్ అనే డ్రైవర్ ట్రక్ పర్మిట్‌ను రెన్యూవల్ చేయించేందుకు గంజంలోని స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. అధికారులు ట్రక్‌తో పాటు ప్రమోద్ లైసెన్స్ వివరాలను తనిఖీ చేశారు. ఐతే ఆ లారీపై ఒక చలాన్ పెండింగ్ ఉందని చెప్పారు. గతంలో హెల్మెట్ లేకుండా లారీ నడిపావని.. అందుకు రూ.100 జరిమానా పడిందని, ఆ డబ్బులను ఇంత వరకూ కట్టలేదని అడిగారు. 
 
అధికారులు చూపించిన చలానా చూసి లారీ డ్రైవర్ ఖంగుతిన్నాడు. లారీలో కూడా హెల్మెట్ పెట్టుకుంటారా సార్.. అని ప్రశ్నించాడు. అదంతా మాకు తెలియదు..ఇక్కడ చలానా ఉంది. కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అది కడితేనే పర్మిట్ రెన్యువల్ చేస్తామని చెప్పారు. దాంతో చేసేదేం లేక.. అతడు వెయ్యి రూపాయలు జరిమానా కట్టాడు. ఆ తర్వాత ట్రక్ పర్మిట్‌ను అధికారులు రెన్యువల్ చేశారు.