గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (17:44 IST)

జీడి మామిడి తోటలో యువతి చెట్టుకు వేలాడుతూ..?

జీడి మామిడి తోటలో ఓ యువతి మృతదేహం ఒడిశాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జీడి మామిడి చెట్టు వద్ద రెండు కుక్కలు అరుస్తుండటంతో కొందరు వ్యక్తులు ఆ చెట్టు వద్ద ఏముందా అని తీక్షణంగా చూస్తే వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ మామిడి చెట్టుపై ఓ యువతి కూర్చుని ఉన్నట్టుగా ఉంది. పరిశీలనగా చూస్తే వారికి అప్పుడు తెలిసింది. ఆమె చనిపోయి ఉందని. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశిలించారు. 
 
ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలోని డాబుగాం సమితి, ఘోడాఖంటి గ్రామ పంచాయతీలో మఝిగుడ అనే ఓ గ్రామం ఉంది. ఆ ఊరి చివర ఓ జీడిమామిడి తోట ఉంది. ఆ తోటలో శుక్రవారం ఓ యువతి మృతదేహం బయటపడింది. 
 
చెట్టుపై కూర్చున్నట్టుగా ఆ యువతి మృతదేహం ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరి వేసుకున్నట్టుగా లేకుండా, కూర్చోబెట్టిన స్థితిలో ఉండటంతో, ఆమెను ఎవరో చంపి, ఇక్కడ పడేసి ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. యువతి అదే ఊరికి చెందిన లలిఫా హరిజన్ అనే 22 ఏళ్ల యువతిగా తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.