బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (07:41 IST)

కర్నాటకలో ఉబెర్, ర్యాపిడో సేవలు బంద్... సర్కారు ఆదేశాలు

Uber
కర్నాటక రాష్ట్రంలో ఓలా, ఉబెర్, ర్యాపిడ్ సేవలు నిలిచిపోయాయి. ఈ మూడు సంస్థలకు చెందిన ఆటో రిక్షా సర్వీసులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో బుధవారం నుంచి ఈ ఆటో రిక్షా సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సంస్థలకు చెందిన ఆన్‌లైన్ బుకింగ్స్‌ను సైతం నిషేధిస్తున్నట్టు పేర్కొంది. 
 
రోడ్డు రవాణ సంస్థతో పాటు రోడ్డు భద్రత విభాగంతో మంగళవారం జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఈ సంస్థలు ప్రజలకు ఎటువంటి సేవలను కల్పించేందుకు అనుమతి లేదని రాష్ట్ర రవాణ సంస్థ కమిషనర్​ తెలిపారు. 
 
మరోవైపు, కర్ణాటక ఆన్-డిమాండ్ రవాణా టెక్నాలజీ ఆగ్రిగేటర్స్ రూల్(కొట్టార్-2016) చట్టం ప్రకారం క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులు అందించేందుకు అవకాశం లేదని రవాణా కమిషనర్ తెలిపారు. ఆటో రిక్షా సేవలు నిలిపివేసేలా సైబర్ డివిజన్​కు లేఖ రాస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.