ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (08:48 IST)

సూర్యచంద్ర గ్రహణాలతో గందరగోళం.. దీపావళి-కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలంటే?

Diwali
దీపావళి పండుగ రోజున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. 
 
కానీ 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు అంటున్నారు. 24న ఉదయమంతా చతుర్దశి ఉంటుంది. రాత్రంతా అమావాస్య ఉంటుంది. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కార్తీక పౌర్ణమి విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత కాసేపటి వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. 
 
అంటే, చంద్రగ్రహణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం ఉంది. నవంబరు 7 నుంచే పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయని, కాబట్టి అదే రోజున కార్తీక వ్రతాలు, పూజలు చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.