1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 నవంబరు 2021 (08:55 IST)

డిసెంబరు 4న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం: ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం వచ్చే నెల డిసెంబర్ 4వ తేదీ శనివారం చోటుచేసుకోనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. కానీ జ్యోతిష్కుల చెప్పే ప్రకారం ఇది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. కనుక గ్రహణం రోజున ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.


డిసెంబర్ 4, శనివారం, సూర్యగ్రహణం అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఇది కనిపించకపోయినప్పటికీ, దాని ప్రభావాన్ని నివారించడానికి కొన్ని నియమాలను పాటించడం అవసరం. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

 
సూర్యగ్రహణం సమయంలో ఆహారం తినడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సమయంలో తినకూడదు. సూర్యగ్రహణం సమయంలో కొత్త పనిని ప్రారంభించవద్దు లేదా ఏదైనా శుభ కార్యాలు చేయవద్దు. ఈ సమయంలో గోర్లు కత్తిరించడం, దువ్వెనతో తల దువ్వడం చేయరాదు. గ్రహణ సమయంలో నిద్రించడం నిషిద్ధం. కత్తులు లేదా పదునైన వస్తువులను ఉపయోగించరాదు. గ్రహణం ప్రభావం నుండి ఆహారాన్ని నివారించడానికి, ఇప్పటికే వండిన ఆహారంలో దర్భ లేదా తులసి ఆకులను ఉంచండి. గ్రహణం సమయంలో ఇంటి పూజా మందిరాల తలుపులు మూసేయండి.
 
 
సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయాలి
గ్రహణ సమయంలో అధిష్టాన దేవతను పూజించండి. మంత్రాలను జపించండి. సూర్యగ్రహణం సమయంలో దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రభావాలను నివారించడానికి దానం చేయండి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. ఇంట్లో గంగాజలం చల్లండి. అలాగే గుడిలో గంగాజలం చల్లాలి.
.
 
సూర్యగ్రహణ సమయం... డిసెంబర్ 4, 2021, శనివారం, మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి. సూర్యగ్రహణం డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:07 గంటలకు ముగుస్తుంది.