శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (16:51 IST)

కన్యాకుమారి: బంతిని తెచ్చేందుకు వెళ్లిన సచిన్.. సముద్రంలో మునిగిపోయాడు..

కన్యాకుమారిలో ప్రాంతంలో సముద్రతీర ప్రాంతంలో ఆడుకుంటూ వుండిన బాలురు సముద్రపు అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, మండైక్కాడు ప్రాంతానికి చెందిన బాలురు సచిన్, ఆంటో, రెక్సిన్, రెజిత్‌. వీరు ఆ ప్రాంతంలోని సముద్ర తీరంలో క్రికెట్ ఆడుకుంటుండగా.. ఆ సమయంలో బంతి సముద్రంలో పడింది. ఆ బంతిని తేవడం కోసం సచిన్, ఆంటో సముద్రంలోకి దిగారు. 
 
అప్పుడు రాక్షస అల వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. దాన్ని చూసి సచిన్, రక్షన్‌లను కాపాడేందుకు రెక్సిన్, రెజిత్‌లు కూడా సముద్రంలోకి దిగారు. వారు కూడా అలల్లో చిక్కుకున్నారు. వారి అరుపులను విన్న జాలర్లు యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. 
 
కానీ సచిన్, ఆంటోను కనిపెట్టిన జాలర్లు.. వారిలో సచిన్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆంటో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరు బాలుర ఆచూకీ తెలియరాలేదు. జాలర్లు వారిని వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో కలకలం రేపింది.