1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 మే 2025 (10:19 IST)

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

Pahalgam attackers
Pahalgam attackers
పహల్గామ్ దాడికి ముందు బైసరన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ముందే రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. 
 
పహల్గాం దాడి ఉగ్రవాదులు సురక్షితంగా భారత్‌లోనే ఉన్నారు. స్థానికులే వారికి ఆశ్రయమిచ్చారు. వారికి అన్ని సదుపాయాలు కూర్చి చక్కగా చూసుకుంటున్నారని చెబుతోంది ఎన్ఐఏ.
 
పక్కా ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు దాడి చేశారని..ఆ తరువాత కూడా ఎక్కడ దాక్కోవాలి, భారత భద్రతా దళా నుంచి ఎలాతప్పించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు.