గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (17:08 IST)

మాజీ సీఎం పళనిస్వామికి హైకోర్టులో ఊరట... ఓపీఎస్‌కు చుక్కెదురు

edappadi k palaniswamy
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. జూలై 11వ తేదీన ఆయన సారథ్యంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని తేల్చి చెప్పింది. పైగా, ఈ అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జూలై 11వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నేతలంతా కలిసి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే, ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పార్టీ కన్వీనర్ హోదాలో మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సింగల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదన తీర్పునిచ్చింది. 
 
దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పళనిస్వామి హైకోర్టు బెంచ్‌లో అప్పీల్ చేసారు. ఈ అప్పీల్ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మరోవైపు, హైకోర్టు తీర్పును వెలువరించగానే ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కల్పించారు.