శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:06 IST)

రైతుల ఉద్యమంలో పాల్గొంటా : నౌదీప్‌ కౌర్‌

బెయిల్‌పై విడుదలైన కార్మిక హక్కుల ఉద్యమ కారిణి నౌదీప్‌ కౌర్‌ సింఘు సరిహద్దును సందర్శించి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తరువాత ఏం చేయాలో తన కుటుంబసభ్యులతో చర్చిస్తానని అన్నారు.

కచ్చితంగా సింఘు సరిహద్దుకు వెళతానని, రైతుల ఉద్యమంలో పాల్గొంటానని అఆన్నారు. గతంలో కూడా చట్టవిరుద్ధంగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని.. ఎల్లప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడతానని అన్నారు. తనతో పాటు అరెస్టైయిన మరో దళిత కార్యకర్త శివకుమార్‌ గురించి కూడా మీడియాకు వివరించారు.

శివకుమార్‌ పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. జనవరి 12న ఆయన అక్కడ లేరని, అయినప్పటికీ చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేసి దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ.. ఆస్పత్రికి తరలించలేదని అన్నారు. కాగా, ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఒక కర్మాగారం వెలుపల కార్మికుల తరపున నిరసన వ్యక్తం చేస్తున్న నౌదీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.