శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జులై 2023 (11:02 IST)

తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో 47 కొండచిలువలు, రెండు బల్లులు

python
తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుల ట్రాలీ బ్యాగ్‌లో 47 పాములు, అరుదైన రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్థుడిని మహమ్మద్ మొయిదీన్‌గా గుర్తించారు.
 
బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్‌ను అడ్డుకున్నారు. అతని బ్యాగ్‌ల్ల సెర్చ్ చేయడంతో అందులో వివిధ రకాల సరీసృపాలను గుర్తించారు. వెంటనే అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సరీసృపాలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.