మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

ప్లాస్టిక్​పై పోరు: దేశవ్యాప్తంగా 'ప్లాగ్​ రన్​'

ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొట్టే దిశగా భారత్​ తొలి అడుగు వేసింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ఉదయాన్నే ప్రధాన నగరాల్లో ప్లాగ్​ రన్​ సందడిగా సాగింది. ఔత్సాహికులు జాగింగ్​ చేస్తూ, రోడ్లపై ఉన్న ప్లాస్టిక్​ వ్యర్థాలను ఏరేశారు.

'ఫిట్​ ఇండియా ప్లాగ్​ రన్​' దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రధాన నగరాల్లో ప్రజలు ఉదయాన్నే జాగింగ్ చేస్తూ, రోడ్డుపై కనిపించిన ప్లాస్టిక్​ను ఏరేశారు. దిల్లీలో ప్లాగ్​ రన్​ను కేంద్ర క్రీడల శాఖమంత్రి కిరణ్​ రిజుజు జెండా ఊపి ప్రారంభించారు. రెజ్లర్ భజ్​రంగ్​ పునియా సహా మరికొందరు క్రీడా ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
భాగ్యనగరంలో ప్లాస్టిక్ నిషేధం
నేల, నీరు, గాలి.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ భూతమే. రాష్టంలో ఈ సమస్య అధికంగా ఉంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి తద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపుతోంది హైదరాబాద్​కు చెందిన ఓ సంస్థ.

ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తూ ఇళ్లను, పుట్​పాత్​లను నిర్మిస్తున్నారు. ఇటు జీహెచ్​ఎంసీ కూడా అక్టోబరు 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం విధించాలని కార్యచరణ అమలు చేస్తోంది.
 
విజయవాడలో..
పర్యావరణ సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత నిత్యజీవనంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ ప్రతిఒక్కరు పర్యావణ సమతుల్యానికి కృషి చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి , రాష్ట్రప్రభుత్వ రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి , ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మొవ్వా తిరుమల కృష్ణ బాబు సూచించారు.

బుధవారం ఉదయం పిడబ్ల్యుడి గ్రవుండ్స్ స్వరాజ్యమైదానం రైతు బజార్ ప్రాంగణంలో మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో చేతిసంచుల పంపిణీ కార్యక్రమాన్ని అయన లాంఛనంగా ప్రారంభించారు. రైతు బజారుకు కూరగాయలను కొనుగోలు చేయడానికి వచ్చిన వారికి గుడ్డతో తయారైన సంచులను అయన స్వయంగా అందించారు.

ఈ సందర్బంగా కృష్ణ బాబు మాట్లాడుతూ.. పర్యావరణం రోజురోజుకు ప్రమాదస్థాయికి వెళ్తోందని, మనందరం కలిసి కృషిచేస్తే పర్యవరణంలో సమతుల్యం సాదించవచ్చునన్నారు. అభివృధ్ధి చెందిన దేశాలు పర్యావరణ సమతుల్యం విషయంలో కూడా ముందుంటున్నాయన్నారు.

భారతదేశంలో కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పర్యావరణానికి ప్రమాదకారిగా ఉంటున్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈదిశగా అడుగులువేస్తూ ప్రభుత్వకార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించిందన్నారు.

జయంతిని పురస్కరించుకుని ఈరోజు మోహాన్ స్పిన్ టెక్స్ ఆధ్వర్యంలో ఈ క్రమంలోనే వస్త్రంతో తయారైన చేతిసంచులను వినియోగించమని కోరుతూ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఈకార్యక్రమంలో మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు జి.రవికుమార్, కృష్ణారావు, జివి లలిత ప్రసాద్, రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.