శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

సైనికులకు స్వీట్లు తినిపించిన మోడీ... జవాన్ల మధ్య దీపావళి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి వేడుకలను భారత సైనికులతో కలిసి జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని దీపావళి వేడుకలను సైనికుల మధ్యనే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి రోజు మొత్తం సైనికులతోనే ఆయ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి వేడుకలను భారత సైనికులతో కలిసి జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని దీపావళి వేడుకలను సైనికుల మధ్యనే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి రోజు మొత్తం సైనికులతోనే ఆయన గడుపుతారు. అలాగే, ఈ యేడాది కూడా సైనికుల మధ్యే గడిపారు. అయితే, ఈ దఫా జమ్మూకాశ్మీర్‌లోని గురెజ్ వ్యాలీలో ఆయన పర్యటించారు.
 
బందిపొర జిల్లాలోని ఎల్‌ఓసి ప్రాంతమే గురెజ్ వ్యాలీ. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు జవాన్లకు ప్రధాని స్వయంగా స్వీట్లు తినిపించారు. అలాగే, ప్రతి జవానుకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. 
 
కాగా, 2014 దీపావళిని ప్రధాని కాశ్మీర్‌లోనే గడిపారు. 2015లో పంజాబ్‌లోని ఇండియా - పాకిస్థాన్ బోర్డర్‌లోనూ, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బోర్డర్ పోస్టుల్లో కాపలా కాసే జవాన్లతో మోడీ దీపావళి వేడుకలు జరుపుకోగా, 2017లో గురెజ్ వ్యాలీలో జరుపుకున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇపుడు గురెజ్ వ్యాలీలో ఆర్మీ, బీఎస్‌ఎఫ్ జవాన్లతో దివాళి జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. జవాన్లతో సమయాన్ని గడపడం వల్ల తనకు ఎంతో ఎనర్జీ వస్తుందన్నారు. ఒకరికొకరం స్వీట్లను తినిపించుకొని.. కాసేపు సరదాగా గడిపామన్నారు. జవాన్లు ప్రతి రోజు యోగ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు.