గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (14:32 IST)

కేదార్‌నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు

Modi
Modi
కేదార్‌నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు నిర్వహించారు. కేదార్‌నాథుడి ఆలయంలో హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక వస్త్రధారణతో మోదీ ఆకట్టుకున్నారు. 
 
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించి మోదీ స్వామి దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా మోదీ సందర్శించారు.
 
గౌరికుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు రోప్‌వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. కేదార్ నాథ్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం బ్రదీనాథ్‌ కూడా మోదీ వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.