ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (10:59 IST)

అర్థరాత్రి మూత్ర విసర్జనకు వచ్చిన మహిళ... వెనుకనే గట్టిగా పట్టుకున్న కానిస్టేబుల్

కొన్ని ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులుగా మారుతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్లో కామంతో కళ్లుమూసుకుని ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అర్థరాత్రిపూట మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన మహిళను ఓ కానిస్టేబుల్ వెనుకనే వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. దీంతో బిత్తరపోయిన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో కానిస్టేబుల్‌ పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని రాఘవేంద్ర నగరులో కానిస్టేబుల్‌ మహబూబ్‌ నివాసం ఉంటున్నాడు. ఈయన ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళ ఈ నెల 13న అర్థరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చింది. 
 
అయితే, ఆ మహిళపై ఎప్పటి నుంచో కన్నేసివున్న కానిస్టేబుల్... ఇదే అదునుగా భావించి ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న మరోవ్యక్తి అడ్డుకోవడానికి యత్నించాడు. 
 
పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. నజరాబాద్‌ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.